బోయినపల్లి, జూలై 17: రాష్ట్రంలోని రైతులందరి కుటుంబాల్లో ఆనందం చూసి రైతుల ఇంట సిరులు పండాలన్నదే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం మాన్వాడలోని ఎస్సారార్ జలాశయం నుంచి దిగువన ఉన్న ఎల్ఎండీ జలాశయానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్‌తో కలిసి ఐదు గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, ఈ క్రమంలో ఎస్సారార్ రిజర్వాయర్‌ను వాటర్ జంక్షన్‌గా మార్చి ఇక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారని చెప్పారు. ఇంకా చెరువులు నింపేందు కు కాలువ కూడా నిర్మించారన్నారు.
ఈ యేడాది వర్షాలు పడకపోవడంతో రైతులు దుక్కులు దున్ని ఆకాశం వైపు చూస్తున్నారని, ఈ క్రమంలో పుష్కలంగా నీరందించాలనే సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎల్ఎండీకి నీటిని విడుదల చేసినట్లు వివరించారు. ఇన్నిరోజులు వర్షాలు పడితేనే చెరువుల్లో నీళ్లు కనిపించేవని, కానీ ఇప్పుడు వర్షాలు లేకున్నా ప్రాజెక్టులు, చెరువులు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ప్రశంసించారు. ఇక్కడ ఈఎన్సీ శం కర్, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ విజయ, సుడా చై ర్మన్ జీవీఆర్, ఎస్ఈ సుమతి, డీఈఈలు అంజ య్య, రాజు, శ్రీనివాస్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, ఏఎంసీ చై ర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, మాజీ ఎంపీపీ సత్తినేని మాధవ్, మానువాడ సింగిల్‌విండో చైర్మన్ దుర్గారెడ్డి, మానువాడ ఎంపీటీసీ ఐరెడ్డి గీత, స్తంభంపల్లి ఎంపీటీసీ అక్కెనపల్లి ఉపేందర్, నాయకులు సంబ లక్ష్మీరాజం, శంకర్, శ్రీనివాస్‌రెడ్డి, ఐరెడ్డి మల్లారెడ్డి, సాగర్, ఏమిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఉన్నారు.
వరదాయిని కాళేశ్వరం
తెలంగాణ వరదాయినీ కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ సీజన్లో వానలు లేవని ఏ ఒక్క రైతు బాధపడద్దు. మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. పుష్కలంగా జలాలు ఉన్నాయి. సాగునీరు సమృద్ధిగా అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టులోని నీటిని రాష్ట్రంలోని ప్రాంతాలకు తరలిస్తున్నాం. ప్రాణహిత జలాలను లింక్, 1,2లోని పంపులు, రాంపూర్, రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్‌ల మీ దుగా ఎస్సారెస్పీకి పంపిస్తున్నాం. ఇటు ఎస్సారార్ రిజర్వాయర్ కింద ఉన్న ఎల్ఎండీ, కాకతీయ కెనాల్ నుంచి హుజూరాబాద్, హన్మకొం డ, నర్సంపేట, మహబూబ్‌నగర్, ఖమ్మం, సూ ర్యాపేట దాకా లింక్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేశాం. అన్నపూర్ణ ప్రాజెక్టు, గౌరవెల్లి, రిజర్వాయర్లకూ ఎస్సారార్ నుంచి తరలిస్తున్నం.
– బీ వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
జిల్లా కోనసీమను తలపిస్తోంది..
నాటి సమైక్య పాలనలో రైతుల కండ్లల్లో కన్నీటి ధార పారగా, నేడు సీఎం కేసీఆర్ పాలనలో రైతుల కండ్లల్లో ఆనందం కనిపిస్తోంది. సాగుకు పుష్కలంగా కాళేశ్వర జలం తరలివస్తోంది. నేడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాను చూస్తే మరో కోనసీమగా అనిపిస్తోంది. రైతుల్లో ఇంత సంబురాన్ని నింపిన ఈ ప్రాజెక్టులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ సన్నాసులకు కనిపించకపోవడం బాధాకరం. వాళ్లకు కనీస విజ్ఞత ఉంటే ఈ ప్రాజెక్టుల వద్దకు వచ్చి ప్రగతిని చూడాలి.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే
మూడు పంటలకూ నీళ్లు
నాడు అడుగంటిన గోదారిని తలుచుకుంటూ ఎన్నో పాటలు పాడుకుని, ఉద్యమం చేశాం. కానీ సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో గోదారి సజీవంగా మారింది. దిగువకు పారే గోదారి ఎగువకు ఎదురెక్కి ప్రాజెక్టుల్లోకి చేరి కళకళలాడుతూ సాగుకు భరోసా ఇస్తున్నాయి. ఈ రోజు ఏ కాలమైనా రైతన్న మూడు పంట లు వేస్తున్నాడంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతే.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే