Minister Adluri Laxman Kumar | ధర్మారం, జూలై 31: న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపులో నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మాంచారు.
నూతనంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన సందర్భంగా అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు నార అశోక్ రెడ్డి, బొట్ల లక్ష్మీనర్సయ్య, నూనే సత్యనారాయణ , భీమారపు సంపత్ తదితరులు లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.నంది మేడారం కోర్టు అభివృద్ధి కోసం కృషి చేయాలనీ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా బార్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక ఏర్పాటు చేసి సమస్యల పరిష్కరానికికృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగారెడ్డి గారు తెలిపారు.