Millennium Youth | చిగురుమామిడి, మే 4: మండలంలోని రేకొండ గ్రామంలో అప్పాల ఐలయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం రూ.పదివేల నగదు సాయం అందజేశారు. యూత్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. అలాగే తమ సభ్యుల కుటుంబాలకు అన్ని విధాల చేదోడు వాదోడుగా సహకారాన్ని అందిస్తున్నామన్నారు.
నగదును అందజేసిన వారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిప్ప తిరుపతి, ఉపాధ్యక్షుడు పరుపాటి మైపాల్ రెడ్డి, కోశాధికారి లంకసిరి శ్రీనివాస్, సభ్యులు గండ్రతి రాజు, భాష బత్తిని శ్రీనివాస్, నూకల వెంకటేశ్వర్లు, కట్కోజ్వల ప్రశాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.