Nandi Medaram | ధర్మారం, ఏప్రిల్ 11 : నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని పీహెచ్సీ (6 పడకలు ) నుంచి సీహెచ్సీ(30 పడకలు)గా అప్ గ్రేడ్ చేసి నిధులు కేటాయించడంతో దవాఖాన భవనం పూర్తై ప్రారంభానికి నోచుకుందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ మండల, గ్రామ శాఖ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్, రాష్ట్ర మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, తన్నీరు హరీష్ రావు చిత్రపటాలకు శనివారం క్షీరాభిషేకం చేశారు. గత ఏడాది క్రితమే దవాఖాన భవనం పూర్తికాగా శుక్రవారం ప్రారంభానికి నోచుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆ దవాఖాన వద్ద కృతజ్ఞతా భావంగా పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు సామంతుల రాజ మల్లయ్య కేసీఆర్, కొప్పుల, తన్నీరు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంను మంజూరు చేస్తూ 2022 లోనే రూ.5.75 కోట్ల నిధులను శంకుస్థాపన చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో ఈ 30 పడకల దవాఖాన భవనం నిర్మాణానికి నోచుకుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నంది మేడారం ధర్మపురి నియోజకవర్గంలో ఉండడంతో ఈశ్వర్ ప్రత్యేక కృషిచేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రంగా అప్ గ్రేడ్ చేయడంతో నేడు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే సౌకర్యం ఏర్పడిందని అన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్, ఈశ్వర్, హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శ్రీధర్ పేర్కొన్నారు. ముఖ్యంగా 30 పడకల దవాఖాన కోసం స్థానిక మాజీ సర్పంచ్ పోనుగోటి మురళీధర్ రావు జ్ఞాపకార్థం అతడి కొడుకులు నర్సింగరావు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి నవీన్ రావు కోట్లాది విలువైన 2 ఎకరాల భూమిని దానంగా ఇచ్చి సహకరించడంతో అప్పటి తమ ప్రభుత్వం ఆ భవనానికి మురళీధర్ రావు పేరు నామకరణం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని శ్రీధర్ గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ప్రకారం పొనుగోటి మురళీధర్ రావు పేరును యథావిధిగా కొనసాగించాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, నాయకంపల్లి సర్పంచ్ షైనేని రవి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నాడెం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు మిట్ట తిరుపతి, బొడ్డు రాములు, పార్టీ నాయకులు అనుబంధ మండలాధ్యక్షుడు గుజ్జేటి కనకలక్ష్మి, దేవి నళిని కాంత్, పార్టీ నాయకులు దేవి రమణ, సాన రాజేందర్, సంధినేని కొమురయ్య, మిట్ట భరత్, నేరెళ్ల చిన్న లచ్చయ్య, ఎగ్గేల స్వామి, ధర్మాజీ నరేష్, మంచెర్ల లచ్చయ్య, బొడ్డు రమేష్, గోల్ల సంతోష్, బరుపటి చిలుకయ్య, పుర్ర గంగయ్య, ఐత వెంకటస్వామి, సాన సత్తయ్య, బొంగాని తిరుపతి, బొంతల నర్సింగం, పులి నవీన్, దామరవేని మల్లేశం, నడిమెట్ల ప్రవీణ్, ఉత్తేము స్వామి, శ్రేయమంతుల విజయ్, ఎండీ రహీం, మందపల్లి శివయ్య, దేవి రాజేందర్, నెల్లి విజయ ,ధర్మారం, నర్సింగాపూర్, శాయంపేట,గోపాల్ రావు పేట,నర్సింహులపల్లి గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు తుమ్మల రాంబాబు, గొడుగు మల్లయ్య, పంజాల శ్రీనివాస్, బొలిశెట్టి సుధాకర్, గాండ్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.