Residential schools | రాయికల్, జూన్ 27:- రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెనూ పకడ్బందీగా అమలు చేయాలని జెడ్పీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అల్లీపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోనే సమస్యలను అడిగి తెలుసుకుని మెనూ ప్రకారం విద్యార్థులకు అల్పాహారం భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీడీవో బింగి చిరంజీవి తనిఖీ చేసి మెనూ ప్రకారం అల్పాహారం భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.