Donate cash | చిగురుమామిడి, డిసెంబర్ 11: చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో పురుషుల పొదుపు సమితి సభ్యుడు మొలుగూరి లోకేందర్ ఇటీవల మృతి చెందాడు. కాగా ఆ కుటుంబానికి రూ.52 వేల సమితి అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు గొడిశాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం మృతుడు లోకేందర్ తల్లికి అందజేశారు.
సంఘ సభ్యులకు పొదుపులు, బోనస్ పొదుపులు, సామూహిక నిధి, అభయ నిధి ద్వారా మొత్తం కలిపి ఆయా కుటుంబానికి అందజేయడం జరుగుతుందని వారన్నారు. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడికి సైదాపూర్ పురుషుల పొదుపు సమితి అండగా ఉంటుందన్నారు. వీరి వెంట సంఘ సభ్యులు పీరల్ల తిరుపతి, రవీంద్ర చారి, అరిగెల రమేష్, పోగుల రవీందర్, పీరల్ల వేణు, కనకం రఘు, చంచల భూమేష్, చంచల సురేష్, నాగరాజు, తిరుపతి, గనకలు అనగొని వీరన్న, బేరి హరీష్ తదితరులు పాల్గొన్నారు.