Political leaders | వీణవంక, సెప్టెంబర్ 8 : వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రానున్న ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా ఆయా పార్టీల రాజకీయ నాయకులతో ఎంపీడీవో మెరుగు శ్రీధర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాల పరిధిలోని ఓటర్ల జాబితాను వెలువరించడం జరుగతుందని, ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని సూచించారు.
అన్ని పార్టీల రాజకీయ నాయకుల ఆమోదం మేరకు తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ పోతుల నర్సయ్య, నాయకులు రాజయ్య, ఎండీ సాహెబ్ హుస్సేన్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.