Medical examinations | ఓదెల, సెప్టెంబర్ 20 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్స్( ఎంపీడబ్ల్యూ ఎస్) కు శనివారం కొలనూర్ ప్రభుత్వ దావఖానలో వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవ-2025 కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఇందులో మల్టీపర్పస్ వర్కర్లకు బీపీ, షుగర్, రక్త పరీక్షలు చేశారు. గ్రామపంచాయతీ సపాయి సిబ్బంది తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తల గురించి డాక్టర్ సంజనేష్ కుమార్ వివరించారు.
జీపీ సిబ్బంది విధి నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా అనారోగ్యానికి గురైతే వెంటనే దావఖానకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొలనూర్ పీహెచ్సి పరిధిలోని 9 గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి షబ్బీర్ పాషా, హెల్త్ సూపర్వైజర్ గోవర్ధన్, హెచ్ఈఓ శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.