Medical camps | వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.. అడిషనల్ డీఎంహెచ్వో రాజగోపాల్ రావు..
ప్రభుత్వ దవాఖానాలలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ డీఎంహెచ్వో రాజగోపాల్ రావు అన్నారు.
Medical camps | |చిగురుమామిడి, ఫిబ్రవరి 20 : ప్రభుత్వ దవాఖానాలలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ డీఎంహెచ్వో రాజగోపాల్ రావు అన్నారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ ఆరోగ్య ఉప కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ శిబిరానికి హాజరై ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వైద్య శిబిరాలలో జనరల్ మెడికల్ చెక్ అప్, స్త్రీల సమస్యలు, చిన్న పిల్లల సమస్యలు, చెవి, ముక్కు, గొంతు, ఆర్థోపెటిక్, కంటి, దంత వైద్య నిపుణులు వైద్య శిబిరానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో రక్త, మూత్ర పరీక్షలతో పాటు గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్షలను ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని చెప్పారు.
గ్రామంలో 308 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారన్నారు. ప్రభుత్వం అందించే వైద్య సదుపాయాలను, ఉచిత మందులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సందీప్ రెడ్డి, బస్తీ దవాఖాన వైద్యాధికారిని విశాల, సర్పంచ్ అల్లెపు సంపత్, పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్, సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎంలు ధనలక్ష్మి, స్వరూప, శైలజ, పద్మ, ఆశాలు బండారి సరోజన, దుడ్డెల తిరుమల, పూజ, ప్రియాంక, సుగుణ, సుజాత, లింగవ్వ, సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణ కు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

