Medical and Health | హుజూరాబాద్ టౌన్, జూలై 17 : కరీంనగర్ కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు సమయపాలన పాటించాలని, ఉదయం 9 నుండి 4 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఆరోగ్య మహిళ, శుక్రవారం సభలను నిర్వహించి మహిళలందరికీ వైద్య పరీక్షలు చేయించాలని చెప్పారు. ఆస్పత్రులలో గర్భిణీ స్త్రీలకు అన్ని సౌకర్యాలు కల్పించామని, అన్ని రకాల ప్రసవాలకు సంబంధించిన సేవలు అందుతాయని, వాటిని వినియోగించుకోవాలని చెప్పారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, వైద్యాధికారులు, వైద్య పిబ్బంది సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డీటీపీవో డాక్టర్ రవీందర్ రెడ్డి, అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ సుధ రాజేంద్ర, డీఐవో డాక్టర్ పాజిడా, సీవో ఎన్సీడీ డాక్టర్ విప్లవ, పీనో ఎంపీహెచ్ డాక్టర్ సనా జనేరియా, పీవోఎన్ హెచ్ఎం స్వామి, వైద్యాధికారులు డాక్టర్ వరుణ, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ మధుకర్, డాక్టర్ శ్రావణ్ కుమర్, పల్లె దవాఖాన వైద్యాధికారులు, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.