Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 31 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో డబ్ల్యూఎఫ్ఎస్కేవో ఆధ్వర్యంలో జరిగిన దక్షిణ భారత ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్-2026 పోటీల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కరాటే విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. రామగుండం నుంచి జపాన్ షిటోరియో కరాటే స్కూల్ విద్యార్థులు కటాస్, కుమితి విభాగాలలో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. బ్లాక్ బెల్ట్ కటాస్ విభాగంలో కీర్తి మహజి (బంగారు పతకం), కుమితి విభాగంలో ఎం కార్తికేయన్ (బంగారు పతకం), కీర్తి మహజి (వెండి పతకం) సాధించారు.
అలాగే కలర్ బెల్ట్ కటాస్ విభాగంలో శివన్య (వెండి పతకం), నిహాల్ నందన్ (కాంస్య పతకం), పీ వీర (వెండి పతకం), కలర్ బెల్ట్ కుమితి విభాగంలో పీ వీర (వెండి పతకం), నిహాల్ నందన్ (కాంస్య పతకం), శివన్య (బంగారు పతకం) సాధించారు. ఈ మేరకు పథకాలు సాధించిన విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన కోచ్ కరాటే శ్రీనివాస్‌ను జపాన్ షిటోరియో కరాటే స్కూల్ ప్రెసిడెంట్ ఎం రమేష్, సీనియర్ ఇన్స్ట్రక్టర్ ఎస్ శ్రీనివాస్, శ్రావణ్ కుమార్ పటేల్, బీ పరమేష్, నిదిష్ కుమార్, రోహిత్ కుమార్, సంజన, శుభశ్రీ, ఎం ముక్తిశ్రీ, స్నేహ సుల్తానా, హేమలత మహా జీ, అభిజ్ఞ, ఏ శ్రవణ్ కుమార్, స్పందన క్లబ్ సెక్రటరీ డాక్టర్ కే నరేంద్ర సోనీ , స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్, చిరంజీవి, ఆదిత్య, వంశీకృష్ణ, గణేష్ రాజ్, తల్లిదండ్రులు అభినందించారు.