మల్లాపూర్, మే 22: భానుడు భగ్గుమంటున్నడు. పది రోజులుగా ప్రతాపం చూపుతున్నడు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైనే నమోదవుతుండగా, ప్రజానీకం తల్లడిల్లిపోతున్నది. ఇండ్ల నుంచి బయటికి వెళ్లాలంటేనే వణికిపోతున్నది. ఈ పరిస్థితుల్లో కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంటున్నది.
దీంతో మల్లాపూర్‌లోని ఓ రైతు ఓ ఆలోచన చేశాడు. తన పొలం వద్ద నూతనంగా వేసిన బోరుకు మోటర్ బిగించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇలా టెంట్ వేయించాడు. దీంతో మెకానిక్ వచ్చి మోటర్ బిగించాడు.