Godavarikhani | కోల్ సిటీ, జూన్ 21 : ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గోదావరిఖని ఆర్యవైశ్య భవన్ లో ఆదివారం నిర్వహించిన సామూహిక యోగాసనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యాంత్రిక జీవనంలో ఆరోగ్యమే మహాభాగ్యమని సందేశాన్ని ప్రజల్లో స్ఫూర్తి కలిగించేలా వివిధ వర్గాల ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి యోగసానాలతో ఆకట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ యోగ అనేది వ్యాయామం మాత్రమే కాదనీ, మనిషి శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసే గొప్ప సాధనమని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ‘యోగను దినచర్యగా అలవర్చుకోవాలన్నారు.
యోగ గురువు సరోత్తమరెడ్డి మాట్లాడుతూ యోగ సాధన ద్వారా ఆరోగ్యంపై ఆసక్తి పెంపొందించుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి గొప్పతనంను గుర్తు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు రజనీ, సుల్వ లక్ష్మీనారాయణ, ఊరగొండ అపర్ణ, గుండబోయిన భూమయ్య, ఎల్తూరి సరిత, జక్కుల పద్మ, కోట తిరుమల, జక్కన రాజ్యలక్ష్మీ, కోడూరి రమేష్, జక్కన్న బాలు, ప్రవీణ్, లక్ష్మీనర్సయ్య, గంగరాజు, రాజయ్య, నరసింహారెడ్డి, కళ్యాణ్, వకుళాభరణం వేణు, జనగామ శివరాం అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.