PEDDAPALLY | సుల్తానాబాద్ రూరల్, జనవరి 3 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కట్నపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమంత కార్యక్రమానికి సర్పంచ్ ఓగుల పూజ రాజేందర్ హాజరై పలువురు గర్భిణీలకు పూలు పండ్లు అందజేశారు.
అలాగే అన్న ప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉపసర్పంచ్ దాసరి రాయమల్లు, వార్డు సభ్యులు ప్రవీణ్, తిరుపతి, సంపత్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, శారద, అఖిల, వెంకటలక్ష్మి, రాయ మల్లమ్మ, హెల్త్ సూపర్వైజర్ రోజా, ఏఎన్ఎంలు కవిత, భారతి, ఆశాలు విజయ, లావణ్య, సి ఎ. సమత, అంగన్వాడి టీచర్లు కనక లక్ష్మి, స్వప్న, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు, పిల్లల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.