Best employee award | ఓదెల, ఆగస్టు 15 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలువురు ఉద్యోగులకు స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ ఉద్యోగుల అవార్డులు దక్కాయి. ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సిహెచ్ విద్యాసాగర్, ఓదెల మండల వ్యవసాయ అధికారి భాస్కర్, ఓదెల రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న మూర్తిలకు ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందాయి.
విధి నిర్వహణను అంకితభావంతో పనిచేసే ఉన్నతాధికారులు, మండల ప్రజల మన్నలలను పొందారు. ఆయా శాఖలలో వారు చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం ఉత్తమ సేవ అవార్డులను శుక్రవారం స్వతంత్ర దినోత్సవ వేడుకలలో అందజేశారు. వీరిని మండల ప్రజలు పలువురు అభినందించారు.