Manthani ssc results | మంథని, ఏప్రిల్ 30 : 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో మంథనికి చెందిన పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. స్థానిక కాకతీయ ఉన్నత పాఠశాలకు చెందిన దుర్గం త్రేక్ష అనే విద్యార్థినీ 600ల మార్కులకు గాను 579 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌తో పాటు మండల టాపర్‌గా నిలిచారు. కాగా బాసాని సిరివర్షిణీ 567 మార్కులు సాధించి పాఠశాల రెండో టాపర్‌గా నిలిచారు. అదే విధంగా పాఠశాలలో చదువుతున్న 22 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించగా పాఠశాలలో చదువుతున్న 42మంది విద్యార్థులంతా 100శాతం ఉత్తీర్ణత సాధించారు.
మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, కృషి చేసిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్‌రెడ్డి, డైరెక్టర్లు రవి కిరణ్‌రెడ్డి, శ్రావణ్‌రెడ్డి, స్రవంతి, పావనీ ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలకు చెందిన ఎం.అజయ్ కుమార్ 573, అభినవ్ 566, కౌశిక్, భార్గవ్ 563 మార్కులు సాధించగా 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్రీనాథ్ తెలిపారు.
స్థానిక జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలకు చెందిన సూతారి సాత్విక్ రాజ్ 562, బేర ఆదిత్యతేజ్ 561, జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలకు చెందిన అవధానుల సంజన 561, లక్ష్మిప్రసన్న 544, ఇందు 530, అక్షయ 509, స్నేహ 521, గుంజపడుగు హైస్కూల్‌కు చెందిన రిషిత 530, రవికుమార్ 528, కన్నాల హైస్కూల్‌కు చెందిన చరణ్ తేజ్ 520, ఆరెంద జడ్పీహెచ్ఎస్కు చెందిన బండారి సిరి 510, జనగామ రాంచరణ్ 503 మార్కులు సాధించారు.