Government schemes | జగిత్యాల, ఆగస్టు 2 : మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత మండల సమాఖ్య ప్రతినిధులపై ఉందని జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ అన్నారు. జగిత్యాల జిల్లా సమాఖ్య కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ఆ సంక్షేమ పథకాలు పేద మహిళలకు అందేలా కృషి చేయాలనీ, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల ద్వారా లభిస్తున్న వివిధ ఆదాయభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయించి వారి ఆర్థిక స్థితి గతులను మెరుగు పరిచేలా కృషి చేయాల్సిన బాధ్యత మండల సమాఖ్య లదని అన్నారు.
ఆ బాధ్యతలు అమలు పరిచేలా పర్యవేక్షణ జిల్లా సమాఖ్య కృషి చేయాలనీ, అలాగే ప్రభుత్వ హాస్టల్స్ కి కాస్మోటిక్స్ సరఫరా మహిళా సంఘాల వారు సప్లయ్ చేయడానికి సెర్ప్ నుండి ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు. కావున సంబంధిత మండలాల నుండి ప్రపోజల్స్ లాగిన్ లో ఎంట్రీ చేయాలనీ, రాబోవు సీజన్ లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు పెంచేలా చేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లా సమాఖ్య క్యాంటిన్ ని ఇంకా ఆధునిక హంగులు చేసేలా చూడాలని, ఉల్లాస్ సర్వే పూర్తి చేయాలనీ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు రెండో జత త్వరిత గతిన కుట్టి ఇవ్వాలని సూచించారు.
జిల్లా సెర్ప్ ఏపీడీ సునీత మాట్లాడుతు మండల, గ్రామ సమాఖ్య లు,స్వశక్తి సంఘాల పుస్తకాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని, బ్యాంకు లింకేజి, స్త్రీనిధి రుణాలు టార్గెట్ ప్రకారం సిబ్బంది తో పూర్తి చేయించాలని చెప్పారు. మండల సమాఖ్య ఓబీ సభ్యల గ్రామ సమాఖ్యలు, స్వశక్తి సంఘాల నిర్వహణ పూర్తి స్థాయిలో సక్రమంగా నిర్వహించేలా ఉండాలని, ఖచ్చితంగా సమావేశం లో తీర్మాణం చేసి ఉండాలని అన్నారు.
ఇంకా ఫామ్, నాన్ ఫామ్, సంస్థగత నిర్మాణం, మార్కెటింగ్, డ్రెస్ లు కుట్టుట ఇంకా పలు సెర్ప్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీపీఎంలు విజయ భారతి, నారాయణ, రమేష్, నాగేశ్వర్ రావు, స్త్రీనిధి ఆర్ యం రాం నారాయణ, జిల్లా ఏపీఎంలు కే.చక్రవర్తి, ఆర్ త్రివేణి, వీ గంగాధర్, ఏ శ్రీనివాస్, ఎండీ అహ్మద్ హుస్సేన్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు డీ సరోజన, ప్రధాన కార్యదర్శి ఎన్ ఆమనీ, కోశాధికారి సిహెచ్ హరిత, జెడ్ ఎస్ అసిస్టెంట్ భాగ్య లక్ష్మి, 18 మండలాల మండల సమాఖ్యల అధ్యక్షురాళ్లు, తదితరులు పాల్గొన్నారు.