Maneru : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుణుడి ఉగ్రరూపానికి జనం అల్లాడిపోతున్నారు. కొందరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. గురువారం మూసీ నదిలో సలీం అనే వ్యక్తి గల్లంతవ్వగా.. కరీంనగర్ మానేరు (Maneru) జలాశయంలోనూ ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. లోయర్ మానేరు (Lower Maneru) ప్రధాన కాలువలో చేపలు పట్టేందుకు వెల్లిన అబ్దుల్ రహీం (Abdul Raheem) వరద నీటి ప్రవాహాంలో గల్లంతు అయ్యాడు. ఆచూకీ కనిపించకుండా పోయిన అతడికోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.
హైదరాబాద్లో మూసీ నది ఉద్ధృతికి ఛాదర్ఘట్.. శంకర్ నగర్ వద్ద సలీం అనే వ్యక్తి గల్లంతయ్యాడు. నీళ్లలో కొట్టుకుపోయిన అతడి ఆచూకీ కోసం పోలీసులు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు పుప్పాల వాగులోనూ ఒక వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు.
🚨TELENGANA: Heavy rains lashed Kamareddy, with nearly 300 mm recorded since yesterday, causing flooding in town and nearby villages.
Lakes, streams, and rivers overflowed, while the Upper #ManairDam hit full capacity, sending huge inflows toward Lower and Mid Manair Dams. pic.twitter.com/UXMpuuuNxu
— The Truth India (@thetruthin) August 27, 2025