JAGITYAL | వెల్గటూర్, ఏప్రిల్ 09. ప్రమాదవశాత్తు వ్యవసాయ పరలోపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వెల్గటూరు మండలంలోని జగదేవ్పేటలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన సంఘం మహేష్ (45) వెలగటూర్ మండలంలోని జగదేవ్పేట గ్రామానికి శుభకార్య నిమిత్తం వచ్చాడు.
కాగా బుధవారం ఉదయం కాలకృత్యాలు తీర్చు కునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య మంగ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.