Hanging | కథలాపూర్, మార్చి 13 : కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సైదు నర్సయ్య (56) అనే వ్యక్తి శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్య గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఆసుపత్రులల్లో చికిత్సలు చేయించుకున్న నయం కాలేదు. దీంతో మనస్థాపానికి గురైన నర్సయ్య శుక్రవారం గ్రామశివారులోని అలిసె గుట్ట వద్ద ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుమారుడు స్వామి ఫిర్యాదు మేదరు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ పేర్కొన్నారు.