కరీంనగర్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దుండగుల చేతిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ మండలం ముగ్ధుంపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన డ్రైవర్ ఖాదర్ హుస్సేన్ (45) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపి ముగ్ధుంపూర్ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద గడ్డి కింద దాచి వెళ్లారు.
సోమవారం ఉదయం బావుల వద్దకు వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ తగాదాల కారణంగా హుస్సేన్ బావమరిదే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫ్రాథమికంగా తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.