కమాన్ చౌరస్తా, మార్చి 13 : కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన పరీక్షలో ఒకరిపై మాల్ ప్రాక్టీస్(Malpractice) కేసు నమోదు చేసినట్టు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ వన్ బి, జువాలజీ, హిస్టరీ మొదటి పేపర్లో భాగంగా, కరీంనగర్ ట్రినిటీ కళాశాలలో పరీక్షకు హాజరైన విద్యార్థి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడినట్లు ఆయన వివరించారు.
ఈ మేరకు విద్యార్థి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు . కాగా, ఈరోజు పరీక్షలో మొత్తం 17, 896 మంది విద్యార్థులకు 17,404 మంది విద్యార్థులు హాజరవగా, 492 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి..
Champion Movie | సాకర్ నేపథ్యంలో రోషన్ మూవీ.. ‘ఛాంపియన్’ గ్లింప్స్ రిలీజ్
Chennai: ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..