చెన్నై: చెన్నై(Chennai)లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు .. స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. భార్యాభర్తలతో పాటు ఇద్దరు టీనేజ్ కుమారులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టరు, అడ్వకేట్ జంటతో పాటు ఇద్దరు కుమారులు వేర్వేరు రూముల్లో శవాలుగా పడిఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయం డాక్టర్ డ్రైవర్ పని కోసం ఇంటికి రాగా అతనికి అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వాళ్లు అన్నానగర్‌లోని ఇంటి తలుపులు తీశారు.
మృతిచెందిన వారిలో 52 ఏళ్ల బాలమురుగన్, భార్య 47 ఏళ్ల సుమతి ఉన్నారు. భార్యాభర్తలు ఒక రూమ్‌లో.. మరో రూమ్‌లో పిల్లల మృతదేహాలను గుర్తించారు. తిరుమంగళం పోలీసులు అనుమానాస్పద కేసులు నమోదు చేశారు. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసులో దర్యాప్తు కొనసాగనున్నట్లు చెప్పారు. ఆ కుటుంబానికి సుమారు 5 కోట్ల వరకు అప్పు ఉన్నట్లు తెలుస్తోంది.