BSNL Recharge Plans | ప్రముఖ ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు 9కోట్లకుపైగా మొబైల్ యూజర్లు ఉన్నారు. వినియోగదారులందరికీ కోసం బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా ఆఫర్‌ని ప్రకటించింది. ఈ ఆఫర్ కింద భారీగా రీచార్జ్ ప్లాన్ల చెల్లుబాటును పెంచింది. ఇది వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరం చేకూరనున్నది. ఈ ఆఫర్‌ను కంపెనీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. మార్చి నెలలో యూజర్ల కోసం మరింత ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకురావాలని బీఎస్ఎన్ఎల్ యోచిస్తున్నది. పండుగ సీజన్లో వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించనున్నది. ఇటీవల బీఎస్ఎన్ఎల్ సరసమైన రీచార్జ్ ప్లాన్ ద్వారా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి సవాల్ విసురుతున్నది.
బీఎస్ఎన్ఎల్ హోలీ సందర్భంగా యూజర్లకు రీచార్జ్ ప్లాన్స్ వాలిడిటీని పెంచింది. బీఎస్ఎన్ఎల్ రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్‌కు 30 రోజుల అదనంగా వ్యాలిడిటీని పెంచింది. గతంలో ఈ ప్లాన్ చెల్లుబాటు 395 రోజులు ఉండగా.. ప్రస్తుతం 425 రోజులకు పెంచింది. ఈ ప్లాన్‌లో భారత్ అంతటా అపరిమిత కాలింగ్ సౌకర్యం అందించనున్నది. అలాగే, ఢిల్లీ, ముంబయిలోని ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్‌లో కూడా ఉచిత కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 2జీబీ హై స్పీడ్ డేటా, వంద ఉచిత ఎస్ఎంఎస్లను పొందవచ్చు. ఇది మొత్తం ప్లాన్ వ్యవధిలో మొత్తం 850 జీబీ డేటా అందుతుంది. దాంతో పాటు బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ బీటీవీ (BiTV) ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో కొన్ని ఓటీటీ యాప్‌ల యాక్సెస్ సైతం లభించనున్నది.
బీఎస్ఎన్ఎల్ సరసమైన ప్లాన్లను అందించడమే కాకుండా దాని నెట్వర్క్ మౌలిక సదుపాయాలను కూడా బలోపేతం చేస్తోంది. 2025 ప్రథమార్థంలో భారతదేశం అంతటా ఒక లక్ష కొత్త 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. గత సంవత్సరం బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 65వేల కంటే ఎక్కువ 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. మిగతా టవర్లు రాబోయే నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. దాంతో వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్ కనెక్టివిటీని అందించనున్నాయి. బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్స్, నెట్వర్క్ విస్తరణ ప్రస్తుత కస్టమర్లకు ప్రయోజనకరంగా ఉండడంతో పోటీ యుగంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పెద్ద ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ సేవలను మెరుగుపరిచేందుకు వినియోగదారులకు తక్కువ ధరకే.. అధిక నాణ్యత గల టెలికాం సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొంది.