Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 7 : మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక టీయూడబ్యూహెచ్ 143-జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రుద్ర రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వేముల శ్రీనివాస్, తోట లింగన్న, బూరుగుపల్లి నర్సింగరావు, జెట్టి శ్రీలతను ప్రెస్‌క్లబ్ ఆవరణలో సోమవారం ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ సేవలను అందించి జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం హర్షణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దామోదర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కనుక సంజీవ్, పాత్రికేయులు సుతారి కృష్ణమాచారి, జరుపుల రమేష్, వంగ శేఖర్, పెంబి మహేష్, బండారి వెంకటేష్, మహేష్, నాయకులు ముద్దం సత్యం, ఇల్లెందుల రమేష్, ఎర్ర రాజు, సామాజిక కార్యకర్త వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.