NTPC Elections | జ్యోతినగర్, సెప్టెంబర్ 21: ఎన్టీపీసీ ఉద్యోగుల మెరుగైన వేతన సవరణ కోసం ఈ నెల 25న జరిగే రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘ్ ను గెలిపించాలని బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ సుంకరి మల్లేశం అన్నారు. ఎన్టీపీసీ నంబర్ వన్ గేట్ వద్ద జరిగిన యూనియన్ గేట్ మీటింగ్ కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఐఎన్టీయూసీ ఉద్యోగుల హక్కులను విస్మరించి అవినీతి పైరవీలకు పాల్పడిందని ఆరోపించారు. 2027 లో జరుగు వేతన సవరణలో మెరుగైన వేతన సవరణ బీఎంస్ తోనే సాధ్యమని, ఈ గుర్తింపు ఎన్నికల్లో బరిలో నిలిచిన ఎన్టీపీసీ కార్మిక సంఘ్ పువ్వు గుర్తుకు ఓటువేసి గెలిపించాలన్నారు.
ఎన్టీపీసీలో ఎన్బీసీ మెంబర్ ప్రచారం
ఎన్టీపీసీలో ఈ నెల 25న జరుగు గుర్తింపు సంఘం ఎన్నికల్లో బరిలో నిలిచిన ఎన్టీపీసీ కార్మిక సంఘ్ ను గెలిపించాలని ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్, బీఎంఎస్ ఆల్ ఇండియా సెక్రటరీ ఆర్ఎన్ గణేశన్ విసృతప్రచారం చేపట్టారు. ప్లాంటులోని ఇండస్ట్రియల్ క్యాంటిన్ ను సందర్శించిన అనంతరం ఉద్యోగుల భేటితో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమమే ధ్వేయంగా పనిచేస్తున్న ఎన్టీపీసీ కార్మిక సంఘ్ పారదర్శకంగా పనిచేస్తుందన్నారు.
ఈ గుర్తింపు ఎన్నికల బరిలో నిలిచిన భారతీయ కార్మిక సంఘ్ కు మద్దతుగా ఉద్యోగులు నిలిచి ఎన్నికల్లో గెలిపించాలని ఓటు హక్కును అభ్యసించారు. ఇక్కడ ఎన్టీపీసీ కార్మిక సంఘ్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి , ప్రధానకార్యదర్శి ఎన్ సాగర్ రాజు, గోల్ల మహేశ్, సత్యనారాణరెడ్డి, పోగుల స్వామి, బండారి కనకయ్య, తదితరులు ఉన్నారు.