Major Robbery | పెద్దపల్లి కమాన్, మే 13 : ఓ ఇంటి తాళాన్ని పగులగొట్టి బంగారు, వెండి ఆభరణలతో పాటు నగదు ఎత్తుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్ కు చెందిన ముస్త్యం రవీందర్ కుటుంబ సభ్యులతో కలిసి ఊరికెళ్లారు.
ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి పగులగొట్టి తులం బంగారం, 4 కిలోల వెండి ఆభరణలతో పాటు రూ.40 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. కాగా, ఇటీవల కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ షాప్ లో దోపిడీకి పాల్పడిన దుండగులు వారం రోజుల పాటు పెద్దపల్లిలో ఉండి రెక్కి నిర్వహించారని తెలిసిందే. అయితే, ఆ ఘటన మరువక ముందే పెద్దపల్లిలో దోపిడీతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు.