Maize purchasing center | చిగురుమామిడి, అక్టోబర్ 27: చిగురుమామిడి మండల కేంద్రంలో హుస్నాబాద్ మార్క్ పేడ్ ఆధ్వర్యంలో సోమవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, తాసిల్దార్ ముద్ధసాని రమేష్, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎస్సై సాయి కృష్ణ సోమవారం ప్రారంభించారు. హుస్నాబాద్ మార్కెట్ కు మక్కలు తీసుకెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా మంత్రి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు.
మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు అమ్ముకోవాలని సూచించారు. ప్రభుత్వం క్వింటాలకు 2400 రూపాయలు కేటాయించడం జరిగిందని, రైతులందరూ సద్విని చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లేశం, ఏఈఓ ఎండి ఫరీద్ నాయకులు రవీందర్, కుద్బుద్దిన్, వేణు, ముద్రకోల రాజయ్య, కనకయ్య తదితరులున్నారు.