Mallapur | మల్లాపూర్, మే 5 : పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలాగా కాపాడిన మక్కజొన్న పంట కండ్ల ముందే ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్యూట్ తో కాలిబూడిదైందటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల లత అనే మహిళ రైతు రోదిస్తు తన ఆవేదనను వ్యక్తం చేసింది. గ్రామశివారులో తమకు ఉన్న ఒక ఎకరం ఇరవై గుంటల భూమిలో పండించిన మక్కజొన్న పంటను కోసి తమ భూమిలోనే ఓ చోట రాశులుగా పోసిన మక్కజొన్న కంకుల కుప్పకు విద్యుత్ షార్ట్ సర్యూట్ తో అగ్నిప్రమాదం వాటిల్లడంతో, ప్రమాదానికి కంకులు కాస్తా కాలిపోయాయి.
ఈ విషయంను తెలుసుకున్న స్థానిక రైతులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికి ఎలాంటి ఫలితం లేకపోయింది. కాలిపోయిన కంకుల కుప్ప వద్ద సదరు రైతు లత రోదిస్తు చేతికి వచ్చిన పంటకు పెట్టుబడి పోను నాలుగు పైసలు వస్తాయాన్న తరుణంలో కండ్ల ముందే కాలిపోయి పంట కనిపించడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.1.75 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని సర్కార్ తమ కుటుంబంను అదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలంను రెవిన్యూ శాఖ ఆర్ఐ అశోక్ పరిశీలించి నష్టపోయిన వివరాలను ఉన్నత అధికారులకు నివేదించున్నట్లు తెలిపారు.