Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 6 : పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించిన పోలీసులు బాదితుడికి సోమవారం అప్పగించారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి కి చెందిన తొట్ల రమేశ్ తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు ప్రత్యేక పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేసి, ఫోన్ గుర్తించి బాధితుడికి అప్పగించారు.
ఈ సందర్భంగా ఏఎస్ఐ నీలిమా మాట్లాడుతూ ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకున్నా.. దొంగతనానికి గురైనా ఆ ఫోన్ వివరాలను సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ పోర్టల్ ద్వారా తిరిగి మొబైల్ పొందే అవకాశం ఉందన్నారు.