Loka Bapureddy | కథలాపూర్, జులై 11 : కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి శుక్రవారం పరామర్శించారు. మండలంలోని తక్కలపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోచంపల్లి నరసయ్య తండ్రి ఇటీవల మృతి చెందారు. దూలూరు గ్రామంలో భీనవేని మురళి తల్లి మృతి చెందిన ఇద్దరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ నాగం భూమయ్య, నాయకులు వర్ధినేని నాగేశ్వరరావు, గుండారపు గంగాధర్, ఎండీ రఫీ, కల్లెడ శంకర్, జిల్లా రాజు, కోట లక్ష్మీ నరసయ్య, ఎండీ ఇర్ఫాన్, ముంజ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.