Residential Area | ధర్మారం,నవంబర్ 28: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జనావాసాల మధ్య వైన్స్ షాప్ ను నిర్వహించడానికి అనుమతి ఇవ్వవద్దని అట్టి వైన్స్ పక్కన ఉన్న ఇండ్ల యజమానులు మిట్టపల్లి చంద్రకాంత్ రెడ్డి, రాజ మల్లయ్య దూడ లచ్చయ్య అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ధర్మారం లో వారు విలేకరులతో మాట్లాడిన వైన్స్ వల్ల కలిగే అనర్థాలపై ఆవేదన చేశారు.
గత కొన్ని సంవత్సరాల నుంచి గాంధీ విగ్రహం ఎదుట ఉన్న ప్రాంతంలో జనావాసాలు తక్కువగా ఉన్న సమయంలో నిర్వహించారని వారు వివరించారు.ఇదివరకు నిర్వహించిన వైన్స్ షాప్ వలన ఇబ్బందులను ఎదుర్కొన్నామని చెప్పారు. అర్థరాత్రి వరకు మందుబాబులు మద్యం ప్రేమించడం వలన తమతోపాటు తమ ఇంట్లో కిరాయి వచ్చే వారికి సైతం ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉన్న వైన్స్ కాలపరిమితి ముగుస్తున్న, కొత్తగా వచ్చిన మద్యం షాపులు యజమానులు అక్కడే వైన్స్ ఏర్పాటు మద్యం దుకాణం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని దానిని అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇక్కడ వైన్స్ దుకాణం ఏర్పడి చేయవద్దని తాము అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మద్యం దుకాణం ఏర్పాటు నిలిపి వేయకుంటే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.