కరీంనగర్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : రెండో విడతలో కరీంనగర్ జిల్లాకు చెందిన 18,510 మంది రైతులకు సంబంధించి రూ. 173.33 కోట్ల రుణమాఫీ జరిగింది. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు.
కలెక్టర్ పమేలా సత్పతి, అ సిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఏవో బ త్తుల శ్రీనివాస్, ఎల్డీఎం ఆంజనేయులు, కేడీసీసీబీ సీఈఓ సత్యనారాయణరావు, సు డా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, బ్యాం కుల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇప్పటి వరకు మొదటి విడతలో రూ. లక్ష, రెండో విడతలో రూ. 1.50 లక్షల వరకు రుణాలు మాఫీ చేశామని, వచ్చే నెలలో రూ. 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నారు.
రైతు సంక్షేమమే లక్ష్యం: కలెక్టర్
రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నదని కలెక్టర్ పమేలా సత్ప తి అన్నారు. రుణమాఫీ సందర్భంగా కలెక్టర్ అధికారులు, రైతులతో కలెక్టరేట్లో ని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రెండో విడుతలో 18,510 మందికి రూ. 173.33 కోట్లు రుణమాఫీ జరిగిందని అన్నారు. ల బ్ధి పొందిన రైతులు తిరిగి బ్యాంకుల్లో రుణా లు తీసుకుని వ్యవసాయానికి ఉపయోగించుకోవాలని కో రారు. అనంతరం పలువు రు రైతులకు కలెక్టర్, అధికారులు రుణమాఫీకి సంబంధిన చెక్కులను పంపిణీ చేశారు.