Ganneruvaram | గన్నేరువరం, నవంబర్ 12 : గన్నేరువరం మండలకేంద్రం గన్నేరువరంలో పశువులకు బుధవారం ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి వల్ల పాల దిగుబడి తగ్గి, పశువు యొక్క ప్రాణానికి ప్రమాదకరం కాబట్టి ప్రతీ రైతు పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేందర్ రెడ్డి, జేవీవో అభిషేక్ రెడ్డి, విజయభాస్కర్, సిబ్బంది దేవరాజ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.