Godavarikhani | అంగన్వాడీల్లో అక్షరాభ్యాసాలు.. సీమంతాలు.. అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన, గర్భిణులకు సీమంతాల మధ్య అంగన్వాడీ కేంద్రాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను గోదావరిఖనిలో మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు.
Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 28 : పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన, గర్భిణులకు సీమంతాల మధ్య అంగన్వాడీ కేంద్రాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను గోదావరిఖనిలో మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. గోదావరిఖని అడ్డగుంటపల్లిలో గల ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఈసీసీఈ వార్షికోత్సవ వేడుకలకు రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి ముఖ్యతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అక్షరభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి ప్రగతి పత్రాలను అందజేశారు. గర్భిణులకు సీమంతాలు చేసి పౌష్టికాహారం అందజేశారు.
మేయర్ మాట్లాడుతూ ఐదేళ్ల లోపు చిన్నారులకు సృజనాత్మకతతో కూడిన విద్య అందించడానికి అంగన్వాడీ కేంద్రాలు దోహద పడుతాయన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అంగన్వాడీ సెంటర్లలో చేర్పించాలన్నారు. గర్భిణీ స్త్రీలు పోషక విలువలతో కూడిన ఆహారంను తీసుకోవాలన్నారు. అంగన్వాడీ సెంటర్ల నుంచి ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడమే గ్రాడ్యుయేషన్ డే ప్రాముఖ్యత అని వివరించారు. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లల గ్రేడ్లు ప్రకటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గట్ల రమేష్, సీడీపీఓ అలేఖ్య పటేల్, పర్యవేక్షకులు మమత, షరీస్, ఎన్జీవో లిటిల్, అంగన్వాడీ టీచర్లు రజిత, మత, శారద, శైలజ, రమతోపాటు పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

