Lift construction work | పెద్దపల్లి, మే29: పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో లిఫ్ట్ ఏర్పాటు పనులు చక చక సాగుతున్నాయి. పెద్దపల్లి మున్సిపల్ నూతన భవనాన్ని రూ. 6.5 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 3 అంతస్తులలో నిర్మించారు. కాగా గతేడాది డిసెంబర్ 4న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
కానీ లిఫ్ట్ లేక వృద్దులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నరని మెట్లెక్కలేక ఇబ్బందులు…అనే శీర్షికతో ఈనెల 9న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. కాగా, మున్సిపల్ అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్‌తో లిఫ్ట్ ఏర్పాటు పనులు చక చక చేయిస్తున్నారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వారం రోజుల్లో లిఫ్ట్ ను అందుబాటులో తెస్తామని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ తెలిపారు.