తిన్న రేవు తలుద్దాం..
అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, పేదలు గౌరవంగా బతికేందుకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు స్పష్టం చేశారు.
- పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉందాం
- ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుదాం
- పేదలు గౌరవంగా బతికేందుకు డబుల్ ఇండ్లు
- నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, ఫిబ్రవరి 3: అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, పేదలు గౌరవంగా బతికేందుకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు స్పష్టం చేశారు. అభివృద్ధ్ది ఫలాలను గుర్తు చేసుకుంటూ, తిన్నరేవు తలుచుకుంటూ మరోసారి బీఆర్ఎస్కు అండగా ఉందామని కోరారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి, వీర్నపల్లితోపాటు ఎర్రగడ్డతండాలో 86 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీలు పిల్లి రేణుక, మాలోత్ భూల, జడ్పీటీసీ గుగులోత్ కళావతితో కలిసి ఆయా చోట్ల వేర్వేరుగా శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తున్న దేశంలోని ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని కొనియాడారు. పక్క రాష్ర్టాలు సైతం తెలంగాణలో కలుపాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అరోపణలు చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఆ ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు. అంతకుముందు అక్కపల్లిలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఇక్కడ సెస్ డైరెక్టర్ వర్సకృష్ణహరి, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్, తహసీల్దార్ జయంత్‌కుమార్, మాజీ ఎంపీపీ ఎల్సాని మోహన్‌కుమార్, మాజీ సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, సర్పంచ్ ముక్క మధుకర్, ఉప సర్పంచ్ గోగూరి ప్రదీప్‌రెడ్డి, కొలుగూరి చందర్రావు, భూపతి, రవీందర్ రెడ్డి, దేవేందర్ యాదవ్, రాజు, బాబు, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

