Peddapally | పెద్దపల్లి కమాన్, ఆగస్ట్ 11 : పిల్లల్లో శారీరక, మానసిక వ్యాధులకు కారణమయ్యే నులి పురుగులను ఆదిలో నే నిర్ములిద్దామని డీఎంహెచ్వో అన్నా ప్రసన్న కుమారి పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ లో విద్యార్థినులకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నులిపురుగులతో శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుందని, రక్తహీనత, చదువుపై శ్రద్ధ తగ్గడం, చిరాకు, మతిమరపు లాంటి లక్షణాలు పిల్లల్లో తలెత్తుతాయని అన్నారు. ఆల్ బెండజోల్ మాత్ర మింగడంతో నులిపురుగుల సంక్రమణ వ్యాప్తిని అరికట్టవచ్చారు. విద్యార్థులు వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలన్నారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీలు కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో మొత్తం 1,75, 736 మందికి అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బీ కిరణ్ కుమార్, హెచ్ఎం కే అరుణ, ఆర్బీఎస్కే వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.