చిగురుమామిడి, జూన్ 29 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.
వీరి వెంట కెడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గీకురు రవీందర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గూడేల్లి తిరుపతి ముదిరాజ్, కూన మహేందర్, గన్నేరువరం మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చింతల రవీందర్, రేగుల అశోక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్ల సత్తన్న మత్సకార సంఘం అధ్యక్షుడు చెరుకు సంజీవ్, సమ్మయ్య తదితరులు ఉన్నారు. అనంతరం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.