korutla | కోరుట్ల, ఏప్రిల్ 2: నిషేదిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ హెచ్చరించారు. పట్టణంలోని పలు కిరాణ, బేకరీ, స్వీట్ షాపుల్లో ఆయన బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేదిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న దుకాణదారులకు రూ.11 వేల జరిమానా విధించారు.
దుకాణాదారులు నిబంధనలు పాటించాలని ప్లాస్టిక్ బదులుగా జనపనార, బట్ట, కాగితపు సంచులు వాడాలని సూచించారు. లేదంటే జరిమానాలతో పాటూ షాపులను సీజ్ చేస్తామమని హెచ్చరించారు. దుకాణాల్లోంచి వెలువడిన చెత్తను మున్సిపల్ చెత్త సేకరణ వాహన సిబ్బందికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాలె అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు మహేష్, వార్డు అధికారులు జగదీష్, అనిల్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.