police | చిగురుమామిడి, మే 14: ట్రాక్టర్ యజమానులు అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రొఫెషనరీ ఎస్సై జగదీష్ అన్నారు. మండలంలోని రామంచ గ్రామంలో బుధవారం ఇసుక ట్రాక్టర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని మోయ తుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని పలుమార్లు ఫిర్యాదులు రావడం జరిగిందని, అక్రమంగా ఇసుక రవాణా పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
పర్మిషన్ ఓటిపి లేకుండా ఏలాంటి ఇసుకను తీసుకెళ్ల వద్దన్నారు. ఇసుక ట్రాక్టర్లు నడిపితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. భూగర్భ జలాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎలాంటి పైరవీలతో ఇసుక గూర్చి తమ వద్దకు రావద్దని ఎస్సై ట్రాక్టర్ యజమానులను హెచ్చరించారు.