Education minister | పెద్దపల్లి కమాన్, జులై 23 : వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జిల్లాలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను మూసి వేయించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపి, మాట్లాడారు.
రాష్టానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్యాసంస్థల పై పర్యవేక్షణ కరువైందని, దీంతో విద్యావ్యవస్థ అస్తవ్యస్థమైందని ఆరోపించారు. పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్స్, ఎంఈవో, డీఈవో పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని కోరారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ల సందీప్, జిల్లాల ప్రశాంత్, రేణిగుంట ప్రీతీమ్, ఆర్నకొండ సాయిరాం, మామిడిపల్లి అరవింద్, ఆర్నకొండ ఆదిత్య,సాయి, మధుకర్, నితిన్, వినయ్, రాజు పాల్గొన్నారు.