KTR Review | చిగురుమామిడి, ఆగస్టు 1: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కరీంనగర్లో ఈనెల 8న నిర్వహించనున్న బీసీ గర్జన బహిరంగ సభ ఏర్పాట్లపై కరీంనగర్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చిగురుమామిడి మండలం నుండి బీఆర్ఎస్ అనుబంధ బీసీ నాయకులు తరలి వెళ్లారు. బీసీ గర్జన విజయవంతం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని వారన్నారు.
సమీక్షకు తరలిన వారిలో బీఆర్ఎస్ మండల బీసీ నాయకులు పెనుకుల తిరుపతి, రామోజు కృష్ణమాచారి, పెసరి రాజేశం, సన్నిల్ల వెంకటేశం, చింతపూల ఆంజనేయులు, పిల్లి వేణు, బరిగెల సదానందం, ఆనుమాన్ల సత్యనారాయణ, సారంగం, శ్రీనివాస్, ఉల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ ని కలిశారు. బీసీ గర్జన విజయవంతం చేసేందుకు సమిష్టిగా అందరు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ బీసీ నాయకులకు సూచించారు