Genco CMD | జ్యోతినగర్(రామగుండం), మే 24: తెలంగాణ రాష్ట్ర జెన్కో సీఎండీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏస్ హరీశ్ ను రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ 1535 యూనియన్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ విద్యుత్ సౌధలో యూనియన్ సెంట్రల్ అధ్యక్షుడు ఎంఏ వజీర్ ఆధ్వర్యంలో కలిసి సీఎండీకి పూల మొక్కను బహుకరించి శుభకాంక్షలు తెలిపారు.
ఇక్కడ తెలంగాణ ట్రాన్స్ కో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ 1535 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు అబ్దుల్ తఖి, నాయకులు సిర్ర అనంద్ కుమార్, అబ్దుల్ ఖాదర్, సుమదురి, కే రవి, కే శ్రీనివాస్, రమేశ్, బాలరాజ్, ఆనంత్రెడ్డి, అభిలాశ్, రాజు, అవినాశ్, హజీమ్ తదితరులు ఉన్నారు.