Peddapally | పెద్దపల్లి కమాన్, నవంబర్ 24 : పెద్దపల్లి జిల్లా కేంద్రం లోనే జిల్లా ప్రధాన న్యాయస్థాన నూతన భవనము నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారం లో వచ్చాక ఎమ్మెల్యే విజయరమణరావు మాట మార్చారని న్యాయవాదులు ధ్వజమెతారు. జిల్లా కేంద్రంలో భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి సబ్ కోర్ట్ ఎదుట న్యాయవాదులు నల్ల బ్యాడ్జిలు ధరించి, నిరసన తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం పెద్దపల్లిలో జిల్లా కోర్ట్ నిర్మించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు. న్యాయవాదుల నిరసనకు స్థానిక బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఇక్కడ న్యాయవాదులు అజయ్ క్రాంతి సింగ్, రెడ్డి శంకర్, నరేష్, బొంకురి శంకర్, శరత్ తదితరులు పాల్గొన్నారు.