Vemulawada | వేములవాడ డిసెంబర్ 27 : పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన బొప్ప భార్గవి, కనపర్తి సింధూరిలకు వేములవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నిర్వాహకులు శనివారం లాప్ టాప్ బహుమతి అందజేశారు. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వీరి ఉన్నత చదువులకు ప్రోత్సాహకంగా ఉండేందుకు లాప్టాప్ లు బహుమతిగా అందజేసినట్లు పాఠశాల కరస్పాండెంట్ శ్రీసన్నిధి వెంకటకృష్ణ ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రతి విద్యార్థి అంకితభావంతో చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బోధనా సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.