తల్లిగా మారాక, పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నది బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియాభట్. నటిగా సూపర్స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తూ, నిర్మాతగా ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి, డార్లింగ్స్, జిగ్రా వంటి విభిన్న కథా చిత్రాలను నిర్మించి విమర్శకుల ప్రశంసలందుకున్నది అలియాభట్. తాజాగా తన 33వ పుట్టినరోజును పురస్కరించుకొని, కేవలం పిల్లల కోసం ‘ఎటర్నల్ కిడ్స్’ పేరిట మరో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించింది ఈ అందాలభామ. ఈ సంస్థ గురించి అలియా మాట్లాడుతూ ‘ఇది నా ఎటర్నల్ సన్షైన్ సంస్థకు బిడ్డలాంటిది. పిల్లల కోసం అద్భుతమైన కథలను అందించడమే ఈ సంస్థ లక్ష్యం. నా చిన్నప్పుడు విన్న కథల్నీ, నన్ను పెంచిన కథల్నీ ఈ సంస్థ ద్వారా సజీవం చేయబోతున్నా. త్వరలోనే ఈ సంస్థపై మూడు సినిమాలు పట్టాలెక్కనున్నాయి’ అంటూ చెప్పకొచ్చింది అలియాభట్.