Appointed | మంథని, జూలై 25: మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కుడుదుల వెంకన్నను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుడుదుల వెంకన్న ఎంపీటీసీగా పని చేసిన అనుభవంతో పాటు సుధీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కుడుదుల వెంకన్న ఏఎంసీ చైర్మన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అదే విధంగా వైస్ చైర్మన్‌గా ముస్కుల ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్లుగా మంథని సదానందం, కన్నబోయిన ఓదెలు, ఎండీ అంకూస్, రేగళ్ల రామ్మోహన్రావు, ఊదరి శంకర్, గడ్డం పోచయ్య, ఆజ్మీరా చందునాయక్, పన్నాల ఓదెలు, దూలం సులోచన, లింగంపల్లి నర్సింగారావు, రావికంటి వెంకటేష్, ఎల్లంకి శంకర్లింగంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు మల్హర్ పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ శాఖ ఏడీ, మంథని మున్సిపాలిటీ ప్రత్యేకాధికారులు సైతం డైరెక్టర్లుగా కొనసాగనున్నారు.