ముస్తాబాద్, మే 22 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం ముస్తాబాద్ మండలంలో పర్యటించనున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్‌రావు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ముస్తాబాద్ మండలం బందనకల్‌లో పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణానికి హాజరుకానున్నట్లు చెప్పారు.
అనంతరం బందనకల్, ముస్తాబాద్, కొండాపూర్ గూడెం గ్రామాల్లో పలు శుభకార్యాలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. నామాపూర్‌లో శ్రీ వరాల మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్ట, ఆవునూర్‌లో మడలేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్నట్లు వివరించారు.