KTR birthday | చిగురుమామిడి, జూలై 24: : చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యి కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ భవిష్యత్ నాయకుడు కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జంగ రమణారెడ్డి, రైతు బంధు జిల్లా మాజీ సభ్యులు సాంబారి కొమురయ్య, మండల మాజీ రైతు బంధు సభ్యులు పెనుకుల తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు పెసరి రాజేశం, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముక్కెర సదానందం, మైనారిటీ సెల్ అధ్యక్షుడు సర్వర్ పాషా, మండల మాజీ అధ్యక్షుడు కృష్ణమాచారి, సోషల్ మీడియా ఇంచార్జి బొట్ల రవీందర్, మాజీ సర్పంచ్లు బెజ్జంకి లక్ష్మణ్, సన్నీళ్ల వెంకటేశం, బోయిని శ్రీనివాస్, ముప్పిడి వెంకట నర్సింహా రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున రెడ్డి,గ్రామశాఖ అధ్యక్షులు ఆకవరం మఠం శివప్రసాద్, శ్యామకూర సంపత్ రెడ్డి, గీట్ల తిరుపతి రెడ్డి, కత్తుల రమేష్, బుర్ర తిరుపతి, నాగేల్లి రాజిరెడ్డి, నాయకులు ముస్కుల కృష్ణా రెడ్డి, గోగురి కృష్ణా రెడ్డి, కంప అశోక్, ఐలయ్య, సంపత్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.